ఎమ్మిగనూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం కింద 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స పొందేందుకు 70 ఏళ్లు పైబడిన వయోవృద్ధులందరూ అర్హులని ఎమ్మిగనూరు పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్డు నమోదు కొరకు 20-04-2026 సోమవారం నాడు ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు నారాయణ స్కూల్ ఎదురుగా ఉన్న భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యాలయం లో ఆధార్ కార్డు మరియు దానికి లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకొని రావాలని మరిన్ని వివరాలకు 7993682413 నెంబర్ను సంప్రదించవచ్చు అని నాయకులు తెలిపారు.
70 ఏళ్లు పైబడిన వారికి ఉచిత ‘ఆయుష్మాన్ భారత్’ కార్డుల నమోదు
Previous article
Next article

Recent Comments