సూర్య ఉదయం ప్రతినిధి
సైబరాబాద్…..
— కోకాపేట కొత్త చెరువులో ఆక్రమణల తొలగింపు
— 22 ఎకరాల మేర కబ్జాలను తొలగించిన హైడ్రా
— ఖైతలాపూర్‌లోని రహదారి ఆక్రమణల తొలగింపు
చెరువుల ఆక్రమణలపై కన్నెర్రజేసిన హైడ్రా
రహదారిని ఆక్రమించి నిర్మించిన షెడ్డుల తొలగింపు.
రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, కోకాపేట విలేజ్‌లోని కొత్త చెరువు ఆక్రమణలను హైడ్రా తొలగించింది.
ఎఫ్‌టీఎల్ పరిధిలో దాదాపు 1.20 ఎకరాల వరకూ ఆక్రమించి గోల్డ్ ఫిష్ విల్లాస్ కోసం ప్లే ఏరియాలు, పార్కుల నిర్మాణం.
చెరువులో మరో 20 ఎకరాల మేర పలు నిర్మాణ సంస్థల ఆక్రమణలు.
ఫెన్సింగ్ ఏర్పాటు చేసి చెరువును కబ్జా చేసిన పలు నిర్మాణ సంస్థల ప్రతినిధులు.
హైడ్రాకు స్థానికుల నుంచి పెద్దయెత్తున ఫిర్యాదులు. చెరువును కాపాడాలంటూ వినతులు.
ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖలతో కలిసి పరిశీలించిన హైడ్రా.
కోకాపేట కొత్త చెరువు ఎఫ్‌టీఎల్ పరిధి మొత్తం 72 ఎకరాలు కాగా.. ఇందులో 22 ఎకరాల వరకూ ఆక్రమణలు జరిగినట్టు గుర్తించిన హైడ్రా.
ఆక్రమణలను నిర్ధారించుకున్నాక మంగళవారం రంగంలోకి దిగిన హైడ్రా.
చెరువు ఎప్‌టీఎల్ పరిధిలో ఆక్రమణలను తొలగించిన హైడ్రా. ఫెన్సింగ్‌లతో పాటు.. రేకులతో ఏర్పాటు చేసిన ప్రహరీలను తొలగించిన హైడ్రా.
చెరువు హద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ వేస్తున్న హైడ్రా.
కూకట్‌పల్లి మండలం ఖైతలాపూర్‌లో రహదారి ఆక్రమణలను తొలగించిన హైడ్రా.
జ్యువల్ హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ ముందు 1700ల గజాల మేర రహదారి ఆక్రమణలు.
హైడ్రాకు ఫిర్యాదు చేసిన స్థానికులు. సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా.
ఆక్రమణలు నిర్ధారించుకున్నాక మంగళవారం చర్యలు తీసుకున్న హైడ్రా.
నిర్మాణ సంస్థకు చెందిన ఆఫీస్ రూంతో పాటు.. తగిన సమయం ఇచ్చి వెనుక వైపు నిర్మించిన పశువుల షెడ్డును తొలగించిన హైడ్రా.