suryaudhayam.in
Date of Publish : 12 May 2026, 12:36 pm Posted by : SURYA UDHAYAM MEDIA

విష్ణు విస్తారా సమీపంలో భారీగా అక్రమ షెడ్లు..

 

టౌన్ ప్లానింగ్ అధికారులారా…

అక్రమ షెడ్ ల పై చర్యలు తీసుకోవాలి…

 

సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి మాదాపూర్ డివిజన్

 

మాదాపూర్ డివిజన్లో భారీగా అక్రమ షెడ్లు నిర్మాణం…… మాదాపూర్ డివిజన్ సమీపంలోని విష్ణు విస్తార సమీపంలో భారీ అక్రమ షెడ్ లు నిర్మాణం కొనసాగిస్తున్నారు. దీనిపై జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగినది. తక్షణమే జిహెచ్ఎంసి అధికారులు వీటిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతున్నది. ఐరన్ షెడ్లకు జిహెచ్ఎంసి నుంచి ఎటువంటి పర్మిషన్ ఇవ్వబోరు కానీ ఈ నిర్మాణదారులు యద స్వేచ్ఛగా నిర్మాణం కొనసాగిస్తున్నారు ఇలాంటి అక్రమ షెడ్డు ల నిర్మాణాలపై జోనల్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయబడుతున్నది. వెంటనే ఈ నిర్మాణాలపై సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.