suryaudhayam.in
Date of Publish : 30 May 2026, 9:21 pm Posted by : SURYA UDHAYAM MEDIA

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై రెవెన్యూ ఆదనపు కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్

నల్గొండ:

జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జె. శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంవత్సరపు వేడుకలకు రాష్ట్ర రోడ్లు ,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఉదయం 8 గంటలకు పోలీస్ పరేడ్ మైదానంలో గౌరవ మంత్రివర్యులచే జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుందని, ఇందుకుగాను పోలీస్ పరేడ్ గ్రౌండ్ ను సిద్ధం చేయాలని,అలాగే గ్రౌండ్ లో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర శాసనమండలి చైర్మన్, పార్లమెంట్ సభ్యులు శాసనమండలి సభ్యులు శాసనసభ్యులు మేయర్ ప్రజాప్రతినిధులు ముఖ్యులను రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆహ్వానించాలని, అలాగే ప్రతి ఒక్కరికి ఆహ్వాన పత్రికలు వెళ్లేలా చూడాలని ఆర్డిఓను ఆదేశించారు. శానిటేషన్ తోపాటు, క్లాక్ టవర్, కలెక్టరేట్ వద్ద ముందు రోజు నుండే విద్యుత్ దీపాలతో అలంకరించాలని నల్గొండ కార్పొరేషన్ కమిషనర్ ను ఆదేశించారు. పోలీస్ పరెడ్ గ్రౌండ్ ను అవతరణ వేడుకలకు సిద్ధం చేయాల్సిందిగా పోలీస్ అధికారులతో కోరారు. అలాగే అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథితుల సందేశానికి అవసరమైన నోట్స్ అన్ని శాఖలు సమర్పించినందున సందేశాన్ని తయారు చేయాలని సిపిఓ ను ఆదేశించారు. సీటింగ్ ఏర్పాట్లను గృహ నిర్మాణ శాఖ పీడి చూడాలని, యాంకర్, పాఠశాల విద్యార్థులచే 2 సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ అవార్డుల విధులను జిల్లా విద్యాశాఖ అధికారి చూడాలని, కార్యక్రమానికి వచ్చిన వారందరికీ అవసరమైన టీ, స్నాక్స్ ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల అధికారులను, ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అభివృద్ధి తెలిపే శకటాలను ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశిస్తూ డిఆర్డిఓ వీటికి ఇంచార్జిగా వ్యవహరించాలని చెప్పారు. అలాగే వివిధ శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేయాలని, వీటన్నిటిని జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సమన్వయం చేయాలని చెప్పారు.