suryaudhayam.in
Date of Publish : 27 April 2026, 10:06 pm Posted by : SURYA UDHAYAM MEDIA

రక్తదానం చేయండి: ప్రేమ్ కుమార్

కూకట్ పల్లి: ఒక్క సారి రక్తదానం చేస్తే మీ కుటుంబం కూడా ‘రక్తదాత’ కుటుంబంగా గుర్తించబడుతుంది అని జనసేన నాయకులు ప్రేమ కుమార్ అన్నారు. తలసీమియా రహిత తెలంగాణ రాష్ట్రం కోసం చత్రపతి ధర్మ రక్షణ సేన అధ్యక్షుడు కర్ర వేణు గోపాల్ ఆధ్వర్యంలో కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 1 లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది తలసీమియా సోకిన వారికి నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి రక్త మార్పిడి చేయవలసి ఉంటుంది ఇప్పుడు వేసవికాలం కావడంతో రక్తం కొరత ఏర్పడుతుంది దానికి స్పందించి చత్రపతి ధర్మరక్షణ సేన తలసీమియా వ్యాధిగ్రస్తులకు సపోర్టుగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ కో ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలసీమియా రహిత తెలంగాణ ఏర్పాటు కోసం అందరం కృషి చేయాలని, ప్రపంచంలోనే తయారు చెయ్యలేనిది అంటే కేవలం రక్తం ఒకటే అని, యువత ఇలాంటి రక్తం దానం చేయడం చూసి ఒక్క సారి రక్తదానం చేస్తే మీ జీవితంలో మీరు ఒక్క రోగి ప్రాణాన్ని కాపాడినట్టే, మీ కుటుంబం కూడా ‘రక్తదాత’ కుటుంబంగా గుర్తించబడుతుంది వారిని అభినందించారు. కర్ర వేణుగోపాల్ 122 యూనిట్ ల రక్తం దాతల నుండి సేకరించామని తెలిపారు. సహకరించిన రక్త దాతలను, వారి కమిటీ సభ్యులందరినీ అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కర్రి. బాలసుబ్రమణ్యం, గాలి అనిత, తాండూర్ సునీత, జి.నాగేంద్ర ప్రసాద్, నాగేశ్వర్ గుప్తా, ఎస్. పవన్, కర్ర.లక్ష్మీ ప్రసన్న, కే. లక్ష్మి, పి. పవన్, వినోద్, హరిబాబు మరియు జనసేన నాయకులు కొల్లా శంకర్, పోలెబోయిన శ్రీనివాస్, సలాది శంకర్, దాసరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.