suryaudhayam.in
Date of Publish : 25 May 2026, 11:07 pm Posted by : SURYA UDHAYAM MEDIA

ముఖ్యమంత్రిని కలిసిన వాషర్మెన్ (రజక) కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర వాషర్‌మెన్(రజక)కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ దాసరిరాజు అజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా సీఎం‌ను కలిసిన అజయ్ కుమార్‌కు ముఖ్యమంత్రి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వాషర్‌మెన్ సమాజ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరియు కార్పొరేషన్ ద్వారా చేపట్టాల్సిన పథకాలపై చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. కార్పొరేషన్ బలోపేతానికి అవసరమైన అన్ని చర్యల్లో ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. దాసరిరాజు అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 12 సవంత్సరాల తరువాత మొట్ట మొదటి సారిగా కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు రజక సమాజం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. వాషర్‌మెన్ కార్పొరేషన్ సమాజ హక్కులు, యువతకు ఉపాధి అవకాశాలు, GO 102, యువత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు. సీఎం ఇచ్చిన ప్రోత్సాహం తనకు మరింత బాధ్యతను గుర్తు చేసిందన్నారు. సామాజిక న్యాయం, బీసీ వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తన నియామకం ఆ దిశగానే మరో కీలక అడుగని అజయ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాషర్‌మెన్ కుటుంబాలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.