
సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి..
కెపిహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 2 మరియు 3 మధ్య, హనుమాన్ టెంపుల్ వెనుకవైపు ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎన్నో సంవత్సరాలుగా చెత్త వేయడం వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు పలుమార్లు అధికారులకు, అలాగే పరిసర ప్రాంతాల్లో చెత్త వేస్తున్న వారికి చెత్త వేయవద్దని సూచించినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించడంతో పాటు, మన కాలనీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ఇతరులకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో EWS, MIG నివాసితులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.
కాలనీవాసులే తమ సొంత ఖర్చులతో:
ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం
విద్యుత్ శాఖ అధికారుల సహకారంతో తరచుగా జరుగుతున్న షార్ట్ సర్క్యూట్ సమస్యను పరిష్కరించడం
ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడం
ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ సిమెంట్ కంకరతో స్లాబ్ ఏర్పాటు చేయడం
విద్యుత్ శాఖ సిబ్బంది భవిష్యత్తులో మరమ్మతులు చేసుకునేందుకు అనుకూలంగా ఏర్పాట్లు చేయడం
ఇకపై అక్కడ చెత్త వేయకుండా శాశ్వత పరిష్కారం కల్పించడం జరిగింది.
అదేవిధంగా, ప్రతిరోజూ చెత్త వేయడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, కాలనీవాసులే స్వచ్ఛందంగా తమ సొంత ఖర్చులతో అక్కడ వినాయక మండపాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ కార్యక్రమానికి EWS, MIG నివాసితులందరూ తమ పూర్తి సహాయ సహకారాలు అందించారు.
ఆదివారం బ్రహ్మముహూర్తంలో వినాయక విగ్రహ ప్రతిష్ఠ మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది…
ఈ కార్యక్రమం ద్వారా ట్రాన్స్‌ఫార్మర్ పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, ఇకపై అక్కడ చెత్త వేయకుండా ఒక మంచి శాశ్వత పరిష్కారం కల్పించగలిగాము.
ఈ కార్యక్రమంలో పాల్గొని తమ విలువైన సహాయ సహకారాలు అందించిన:
మరియు EWS, MIG నివాసితులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు..