suryaudhayam.in
Date of Publish : 26 April 2026, 1:24 pm Posted by : SURYA UDHAYAM MEDIA

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాజీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ రావు..

 

 

సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి

 

కే పి హెచ్ బి డివిజన్ 6వ ఫేస్ లోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి చతుర్ధి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఆదివారం గణపతి పూజ, పుణ్యావహచన, అంకురార్పణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగాయి.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు , మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్  పూజా కార్యక్రమంలో పాల్గొని.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు… ఈ సందర్భంగా వేద పండితులు వారికి వేద ఆశీర్వచనాలు అందించారు.. వారు మాట్లాడుతూ ఆ పరమేశ్వరుడు దయతో ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని పాడిపంటలు తో పల్లెలు కళకళలాడుతూ.. రైతులు చల్లగా ఉండాలని ఆకాంక్షించారూ.. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అసోసియేషన్ సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…