suryaudhayam.in
Date of Publish : 30 May 2026, 9:12 pm Posted by : SURYA UDHAYAM MEDIA

నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న బండి రమేష్

కూకట్ పల్లి:

 

గాంధీ భవన్ ప్రాంగణంలో ఇందిరా భవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్, ఏఐసీసీ సెక్రెటరీ సచిన్ సావంత్ ఆధ్వర్యంలో జరిగిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం సమావేశంలో బండి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లి నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ ఏజెంట్లను మరియు అన్ని డివిజన్లకు అధ్యక్షులను మరియు ఇతర అనుబంధ సంఘాల కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సమావేశాన్ని ఉద్దేశించి తెలియజేశారు. అనంతరం పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామస్థాయి నుండి సంస్థగతంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన సలహాలు సూచనలను సమావేశంలో వివరించారు. కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బిఎల్ఎల నియామకాలపై నిర్వహించిన సమావేశాలపై పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ మరియు ఎఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్ పూర్తి స్థాయి నివేదికను అందించి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను అందచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు.