-ముందుకు వచ్చిన 10 ఫీట్ల స్లాబ్ ని వెంటనే కూల్చి వేయాలి…
-అంచన వ్యాయం కనీసం 15 లక్షలు..
హౌసింగ్ బోర్డ్ అధికారులకు కూడా ఫిర్యాదు..
-దీనికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి….
సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి…
కెపిహెచ్బి కాలనీ నాలుగో ఫేస్ లోని ఎల్ఐజి ప్లాట్స్ లో
117 లో పాత భవనాన్ని కూల్చి నిర్మాణం చేపడుతున్నారు ఆ భవనానికి ఉన్న స్థలములో కాకుండా అదనపు పరిమితిని మించి 10
పీట్లు స్లాబ్లులు ముందుకు వేసి నిర్మాణం కొనసాగిస్తున్నారు. అసలే ఈ కాలనీలో గజము ధర లక్షన్నరకు పైగా పలుకుతున్నది అటువంటి కాలనీలో 10 ఫీట్లు ముందుకు ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారంటే ఒకసారి ఆలోచించాలి. కనీసం 15 లక్షల రూపాయల గల స్థలముని ఆక్రమించినట్టు కనబడుతున్నది. అందువలన జిహెచ్ఎంసి అధికారు లు వెంటనే ఈ ముందుకొచ్చిన స్థలంలో గల స్లాబుని వెంటనే కూల్చివేయాలని కోరుతున్నారు స్థానికులు. అలాగే ఈ అక్రమ నిర్మాణం చేపడుతున్న వారిపై కూడా నోటీసులు అందజేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతున్నది…