suryaudhayam.in
Date of Publish : 10 June 2026, 7:53 pm Posted by : SURYA UDHAYAM MEDIA

తుగ్గలి ఏ.పీ.టీ.డబ్ల్యూ.ఆర్ స్కూల్ బాయ్స్ గురుకుల పాఠశాలలో అడ్మిషన్ల ప్రారంభం

ఎస్టీ (ST) విద్యార్థులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అవకాశం*: 

ప్రిన్సిపాల్ ఎస్. సుభాన్ భాష*

సూర్య ఉదయం ప్రతినిధి, తుగ్గలి (మండల కేంద్రం), జూన్ 10:

కర్నూలు జిల్లా తుగ్గలి మండల కేంద్రంలోని ఏపీ టీ డబ్ల్యూ ఆర్ ఈ ఎస్ (APTWRS – రాతన) బాయ్స్ గురుకుల పాఠశాలలో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు ప్రారంభమైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ ఎస్. సుభాన్ భాష ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.

ఈ విద్యా సంవత్సరం నుండి అర్హులైన ఎస్టీ (ST) సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ఎటువంటి ప్రవేశ పరీక్షలు లేకుండా “డైరెక్ట్ రిక్రూట్‌మెంట్” (నేరుగా ప్రవేశాలు) పద్ధతిలో సీట్లు కేటాయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. విద్యాపరంగా వెనుకబడిన గిరిజన విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

3వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లలో నేరుగా ప్రవేశం కల్పిస్తారు.

ప్రభుత్వ వసతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపికైన విద్యార్థులకు పూర్తి ఉచితంగా నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్య, ఉచిత వసతి (హాస్టల్), పౌష్టికాహారం, పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫారాలు అందించబడతాయి.

తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ పిలుపు:

“గిరిజన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మా పాఠశాల ఒక చక్కని వేదిక. తుగ్గలి మండలంతో పాటు కర్నూలు జిల్లాలోని పరిసర ప్రాంతాల ఎస్టీ సామాజిక వర్గ తల్లిదండ్రులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని ప్రిన్సిపాల్ పిలుపునిచ్చారు.