suryaudhayam.in
Date of Publish : 17 April 2026, 11:03 pm Posted by : SURYA UDHAYAM MEDIA

గోల్డెన్ అవర్‌లో స్పందిస్తే… ప్రాణాలు కాపాడవచ్చు: పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి

రామగుండం: ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత,ట్రాఫిక్ నియమాలు, ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్‌ఐ ఉదయ్ కిరణ్ ఎన్టీపీసీ మేనేజ్‌మెంట్‌తో కలిసి ఈరోజు ఎన్టీపీసీ ధన్వంతరి ఆసుపత్రి మరియు ఎన్టీపీసీ ప్రాంగణాల్లో అంబులెన్స్ డ్రైవర్లు, స్వయంసేవకులకు ఫస్ట్ ఎయిడ్,గోల్డెన్ అవర్ శిక్షణ మరియు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, రామగుండం సీఐ టి. ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. డీసీపీ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే మొదటి గంట అయిన “గోల్డెన్ అవర్” అత్యంత కీలకమని తెలిపారు. ఈ సమయంలో సరైన వైద్య సహాయం అందిస్తే ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని వివరించారు. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, ప్రమాదాల సమయంలో బాధితులకు వెంటనే సహాయం చేయడం సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. ప్రమాదాల సమయంలో బాధితులకు త్వరితగతిన సమర్థవంతమైన సహాయం అందించడం,ఫస్ట్ ఎయిడ్ పద్ధతులపై ప్రాక్టికల్ శిక్షణ, గాయపడిన వ్యక్తులను సురక్షితంగా ఆసుపత్రికి తరలించడం, రక్తస్రావం ఆపడం, శ్వాసక్రియలను పరిశీలించడం వంటి కీలక విధానాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అంబులెన్స్ డ్రైవర్లు, స్వయంసేవకులు, స్థానికులు కలిపి 100 మందికి పైగా పాల్గొన్నారు.