suryaudhayam.in
Date of Publish : 05 August 2026, 9:38 am Posted by : SURYA UDHAYAM MEDIA

కేపీహెచ్‌బీ 3వ ఫేజ్‌లో ఒరిగిన విద్యుత్ స్తంభం… ఆందోళనలో స్థానికులు…

 

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు…

భయప్రాంతులకు గురవుతున్న స్థానిక ప్రజలు..

  • ఏఈ .మా సమస్య  తక్షణమే పరిష్కరించాలి స్థానికులు..

సూర్య ఉదయం ప్రతినిధి, కూకట్ పల్లి:

కేపీహెచ్‌బీ 3వ ఫేజ్‌లోని ఎంఐజి ప్రాంతంలో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఒరిగి ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న ఈ స్తంభం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం, కెపిహెచ్బి మూడో ఫేస్ లోని ఎంఐజి 68/10 ప్రభుత్వ పాఠశాల దగ్గరలో గత నాలుగు, ఐదు రోజులుగా విద్యుత్ స్తంభం ఒరిగి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల సమీపంలో విద్యార్థులు, స్థానికులు నిత్యం రాకపోకలు సాగించే ప్రాంతం కావడంతో ఎలాంటి ప్రమాదం జరగకముందే వెంటనే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి స్తంభాన్ని మరమ్మతు చేయాలని లేదా కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.