suryaudhayam.in
Date of Publish : 23 April 2026, 7:26 pm Posted by : SURYA UDHAYAM MEDIA

కలెక్టర్ ను కలిసిన మీడియా కమిటీ సభ్యులు ….

సూర్య ఉదయం ప్రతినిధి, మేడ్చల్ మల్కాజిగిరి:

 

మేడ్చల్ జిల్లా మీడియా కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ మనో చౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం కలెక్టరేట్ లోని ఆయన చాంబర్లో కలిసి సత్కరించారు. జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లను మంజూరు చేయాలని కోరడం జరిగింది. ఇందుకు స్పందించిన ఆయన జీవో మేరకు తప్పనిసరిగా అర్హులందరికీ అందజేస్తామని తెలిపారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా జర్నలిస్టులను గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో అక్రిడిషన్ కమిటీ సభ్యులు మోతే వెంకట్ రెడ్డి, గడ్డమీది బాలరాజు, రామారావు, రవి, సునీల్, ప్రసాద్, భూపాల్, రాజేష్ రెడ్డి, యూసుఫ్ దిన్, అబుద్ స్వామి, జిల్లా పౌర సంబంధాల అధికారిని స్వర్ణలత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.