suryaudhayam.in
Date of Publish : 16 September 2026, 9:13 am Posted by : SURYA UDHAYAM MEDIA

అల్లాపూర్ వివేకానంద నగర్ లో గణనాథుడికి ఘనంగా పూజలు..

శ్రీ గణేష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణనాధుడి పూజ

సూర్య ఉదయం ప్రతినిధి కూకట్పల్లి అల్లాపూర్..

అల్లాపూర్ డివిజన్‌లోని శ్రీ వివేకానంద నగర్ కాలనీలో శ్రీ గణేష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణేశ పూజా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీలోని పూజా మందిరాన్ని రంగు రంగుల పూలు, దీపాలు, అలంకారాలతో అందంగా అలంకరించారు. గణనాధుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మంత్రాలు పఠించి, హారతి ఇచ్చి భక్తులు ఆశీస్సులు పొందారు. పూజా కార్యక్రమంలో భక్తులు ప్రసాదం స్వీకరించి, గణేశుని కీర్తనలు గానం చేశారు.పూజ కార్యక్రమంలో కాలనీ వాసులు, భక్తులు, యువ సభ్యులు అందరూ ఏకమై భక్తి శ్రద్ధలతో పాల్గొని పూజా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

శ్రీ గణేష్ అసోసియేషన్ సభ్యులు మరియు కాలనీ వాసులు ఈ సందర్భంగా అందరికీ గణేశుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు.