ఘనంగా కూకట్‌పల్లి బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శివారెడ్డి జన్మదిన వేడుకలు..
మీ అందరి ప్రేమ ఆప్యాయత ఎప్పటికి ఇలాగే ఉండాలి.. శివారెడ్డి..
సూర్య ఉదయం ప్రతినిధి, కూకట్‌పల్లి:
కూకట్‌పల్లి బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శివారెడ్డి జన్మదిన వేడుకలను కూకట్‌పల్లి కె.పీ.హెచ్.బీ.లోని ప్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సూర్య ఉదయం తెలుగు దినపత్రిక తెలంగాణ ఎడిటర్ భాషా, అనుదీప్ రెడ్డి తదితరులు హాజరై శివారెడ్డికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను శివారెడ్డి కట్ చేసి తన జన్మదిన వేడుకలను సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. అనంతరం నిర్వాహకులు భాషా శివారెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి, భారీ గజమాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివారెడ్డి ప్రజలతో సన్నిహితంగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరింత చేరువై సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తూ సమాజ అభివృద్ధికి తనవంతు కృషి చేయాలని కోరారు. ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆదరాభిమానాలతో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, రాజకీయ మరియు సామాజిక రంగాల్లో మరింత గుర్తింపు పొందాలని పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. శివారెడ్డి భవిష్యత్తులో మరిన్ని ప్రజా సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందాలని కోరుకున్నారు.
అనంతరం శివారెడ్డి మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా వచ్చి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలు తనకు ఎంతో ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయని అన్నారు. ఇదే విధమైన ప్రేమాభిమానాలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై కొనసాగాలని ఆకాంక్షించారు. తనపై నమ్మకం, అభిమానంతో అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని శివారెడ్డి పేర్కొన్నారు.
ఈ జన్మదిన వేడుకల్లో పలువురు నాయకులు, మధుసూదన్ రెడ్డి , ఉపేందర్ రెడ్డి, తులసి రెడ్డి, అనుదీప్ రెడ్డి, సాయినాథ్ రెడ్డి, ఆదిరెడ్డి, రమణారెడ్డి, తిరుపతి చారి,పాత్రికేయులు హేమంత్ సాగర్ , సంతోష్ కుమార్, శ్యాంసుందర్, సునీల్ కుమార్, క్రాంతి, శ్రీకాంత్ రెడ్డి, అరుణ రెడ్డి, లక్ష్మీరెడ్డి, సన్నిహితులు, పాల్ రాజు, రాజేష్, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొని శివారెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.